![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika deepam2.ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 761 లో.....మాలిని ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతోందా అని ఫోన్లో మాట్లాడుతూ ఉండగా దక్షిణామూర్తి పెళ్లికి వెళ్దాం అంటాడు. మాలిని మాత్రం మీరు రావద్దు మామయ్యా మీరు వచ్చిన ప్రతిసారీ శివన్నారాయణ మిమ్మల్ని అవమానిస్తాడని ఆపేస్తుంది. వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా.. ఈ దెబ్బతో వాళ్లు తలదించుకుంటారు. మీరు తలెత్తుకుంటారని చెప్పి తనే మండపానికి వెళ్తుంది.
ఇటు జ్యోత్స్న, సూరజ్ సీక్రెట్ గా కలుసుకుంటారు. సూరజ్ గిఫ్ట్ తీసుకొచ్చి మనసుతో ఇస్తున్నా.. ఇప్పుడు ఓపెన్ చేయకు తర్వాత నువ్వు ఒక్కదానివే చూస్తావని సస్పెన్స్ పెడతాడు. జ్యోత్స్న పిచ్చి ప్రేమలో పడి మనం ప్రేమికులుగా ఉండే లాస్ట్ రోజు ఇది రేపటి నుంచి భార్యాభర్తలం అంటూ రెడ్ రోజ్ తో తనే ఐ లవ్యూ సో మచ్ అంటూ ప్రపోజ్ చేస్తుంది. సూరజ్ మాత్రం మండపంలో కలుద్దాం గిఫ్ట్ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు. మండపంలోకి మాలిని రాగానే అందరు షాక్ అవుతారు. నా మేనకోడలి పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానని అంటుంది. శివన్నారాయణ ముందు వరుసలో కూర్చో ఈ పెళ్లిని కళ్లారా చూడు అని సెటైర్ వేస్తాడు. మాలినిని దీప కూర్చోబెడితే కార్తీక్ తేడాగా మాట్లాడుతున్నావ్ పిన్నీ అంటాడు. దానికి మాలిని నేనేమైనా పెళ్లి ఆగిపోతుందన్నానా అది చూద్దామనే వచ్చానంటూ వెటకారంగా నవ్వుతుంది.
చివర్లోనే అసలు ట్విస్ట్. పంతులు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటే జ్యోత్స్న సడన్ గా దాసు దగ్గరకు వెళ్లి కాళ్లపై పడి నన్ను ఆశీర్వదించు నాన్నా అంటుంది. దాసు నాకంత యోగ్యత లేదమ్మా.. నువ్వు నా కడుపున పుట్టడం వల్లే నరకం చూశావని ఏడుస్తాడు. దానికి జ్యోత్స్న వచ్చే జన్మలో కూడా నీ కూతురిగానే పుడతా ఈ పెళ్లి అయ్యాక నువ్వే నా తండ్రివని అందరికి చెప్పేస్తా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |